: విజయ్ కు జంటగా నటించేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదన్న బాలీవుడ్ భామ!


దక్షిణాది సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్లంతా బాలీవుడ్ వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తుంటే... బాలీవుడ్ లోని టాప్ హీరోయిన్లు మాత్రం తమకు దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. ప్రముఖ హీరోయిన్ సోనాక్షి సిన్హా అవకాశం వస్తే మరోసారి తమిళ సినిమాలో నటిస్తానని స్పష్టం చేసింది. తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం తన 61వ చిత్రంలో నటిస్తున్నాడు. దీని తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఈ సినిమాలో సోనాక్షి సిన్హాను తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.

ఇదే విషయం గురించి సోనాక్షిని అడిగితే... విజయ్ తో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అంతేకాదు, మురుగదాస్ సినిమాలో నటించడం తనకు ఎప్పుడూ సంతోషమే అని చెప్పింది. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో హిందీలో అకీరా, హాలిడే సినిమాల్లో నటించానని తెలిపింది. గతంలో రజనీకాంత్ తో కలసి 'లింగా' సినిమాలో నటించానని... ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినప్పటికీ... రజనీలాంటి గొప్ప వ్యక్తితో పనిచేసిన ఆనందాన్ని మిగిల్చిందని చెప్పింది. 

  • Loading...

More Telugu News