: తమిళనాట పెరిగిన ఉత్కంఠ... అజ్ఞాతంలోని ఆ 40 మందీ ఎక్కడ?
తొలుత శశికళ వర్గం చెప్పుకున్నట్టుగా 130 మంది ఎమ్మెల్యేలు ఆమె వర్గంలో లేరని స్పష్టమైన తరువాత తమిళనాడులో ఉత్కంఠ మరింతగా పెరిగింది. శశికళ శిబిరంలో 90 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని బయటకు పొక్కడంతో, పన్నీర్ సెల్వం ఇంటిలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను మినహాయిస్తే, మరో 40 మంది వరకూ అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేల ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకున్న శశికళ వర్గం వాటిని ఆఫ్ లో ఉంచింది. మిగతా వాళ్లు కూడా ఏ మీడియాకూ చిక్కలేదు సరికదా... వాళ్లెక్కడున్నారో, ఎవరికి మద్దతు ఇస్తారోనన్న ప్రశ్నలకూ సమాధానం ఇంకా లభించలేదు. వీరికి ఎవరైనా నాయకుడు ఉన్నారా? అన్నది కూడా తెలియడం లేదు. దీంతో వీరంతా ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు బయటకు వస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.