: తమిళనాడు సంక్షోభం వెనుక కొందరు బీజేపీ నేతలున్నారు!: బాంబు పేల్చిన సుబ్రహ్మణ్య స్వామి


తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ నేపథ్యంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సొంత పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, తమిళనాట సంక్షోభం వెనుక బీజేపీ నేతలు ఉన్నారని బాంబు పేల్చారు. వాస్తవానికి, ఈ సంక్షోభంతో  బీజేపీకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ, కొంత మంది బీజేపీ నేతలు దీని వెనుక ఉన్నారని విమర్శించారు. పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకోలేరని, తమిళనాడు సీఎంగా శశికళతో ప్రమాణ స్వీకారం చేయించాలని సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు మహారాష్ట్రలో ఉండటం సబబు కాదని, తన బాధ్యతల ప్రకారం శశికళతో ప్రమాణ స్వీకారం చేయించాలని అన్నారు.

  • Loading...

More Telugu News