: పన్నీర్ సెల్వంకు అండగా ఉన్నాననే నన్ను బహిష్కరించారు!:బహిష్కృత కార్యదర్శి ఆరోపణలు
అన్నాడీఎంకే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ తమ పార్టీ ఐటీ కార్యదర్శిగా ఉన్న జి.రామచంద్రన్‌ను శశికళ నటరాజన్ ఈ రోజు బహిష్కరించి, ఆయన స్థానంలో వీవీఆర్ రాజ్ సత్యయాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, తనను తొలగించడం పట్ల జి.రామచంద్రన్ స్పందిస్తూ... తాను శశికళకు వ్యతిరేకంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు పలికినందుకే ఈ వేటు వేశారని ఆరోపించారు. తనకు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్టీలో పదవి ఇచ్చారని చెప్పారు. కొత్తగా నియమితులైన వీవీఆర్ రాజ్ సత్యయాన్ కు తాను అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తాను జయలలిత వేసిన బాటలో పనిచేస్తానని చెప్పారు.