: ఈ నెల 16న వివరణ ఇచ్చుకోవాలి.. లేదంటే చర్యలే: సానియా మీర్జాకు స‌మ‌న్లు జారీ


సేవా పన్నుల చెల్లింపులు సక్రమంగా చేయనందుకు గానూ ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు సర్వీస్ ట్యాక్స్ అధికారులు సమన్లు  జారీ చేశారు. సానియా మీర్జా ఈ నెల 16న త‌మ కార్యాల‌యానికి వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చుకోవాల‌ని చెప్పారు. హైద‌రాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని సేవా పన్ను విభాగం అధికారులు రెండు రోజుల క్రితం ఆమెకు సమన్లు జారీ చేశారని, అయితే జూబ్లీహిల్స్‌లో ఉంటున్న సానియా మీర్జాకు వీటిని తాజాగా అందించామ‌ని సంబంధిత అధికారులు చెప్పారు. 1994 ఆర్థిక చట్టం ప్రకారం ఆమెకు ఈ సమన్లు జారీ చేశామ‌ని చెప్పారు. ఆమె స్పందించి తగిన పత్రాలు ఇవ్వ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News