: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉద్రిక్తత... కాంగ్రెస్ ఎమ్మెల్యేకి గాయాలు


ఆస్తి నష్టం బిల్లులో అనేక సవరణలు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ‌బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు ర‌చ్చ ర‌చ్చ చేశారు. కాంగ్రెస్ నేత‌ల ఆందోళ‌న‌తో ఆ రాష్ట్ర‌ అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష సభ్యులు సభలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, మైకులను విరగ్గొట్టారు. పేపర్లను చింపి విసిరేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌శ్చ‌ిమ బెంగాల్‌ కాంగ్రెస్ సభ్యుడు అబ్దుల్ మన్నన్‌కు గాయాల‌య్యాయి. దీంతో ఆయ‌న‌ను చికిత్స  కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ నేత‌లు నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News