: తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల ఆటలు ఇకపై సాగవు!.. అసోం ప్రభుత్వం స్పష్టీకరణ
తల్లిదండ్రులను పట్టించుకోని, వారి బాగోగుల గురించి ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగుల ఆటలు ఇకపై సాగవని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది. వయసు పైబడిన తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి, ఆ తల్లిదండ్రులకు అందించనున్నట్టు అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా పేర్కొన్నారు. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. 2017-18 నుంచి ఈ నిబంధనలు అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, లేని పక్షంలో, సదరు ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తామని పేర్కొన్నారు.