: మరో నిర్ణయం.. అన్నాడీఎంకే ఐటీ కార్యదర్శిని బహిష్కరించిన శశికళ నటరాజన్
తమిళనాడులో గంట గంటకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడంటూ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను బహిష్కరిస్తామని ప్రకటించిన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే ఐటీ కార్యదర్శిగా ఉన్న జి.రామచంద్రన్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆయన స్థానంలో వీవీఆర్ రాజ్ సత్యన్‌ను నియమిస్తున్నట్లు ఆమె తెలిపారు.