: జయలలిత కూడా నన్ను నవ్వుతూ పలకరించేవారు!: శశికళకు కౌంటర్ ఇచ్చిన స్టాలిన్


అసెంబ్లీలో పరస్పరం ఎదురు పడ్డప్పుడు తాము నవ్వుకోవడం కూడా తప్పేనా? అని అన్నాడీఎంకే నేత శశికళను తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, డీఎంకే నేత స్టాలిన్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై శశికళ ప్రశ్నించడాన్ని వారు తప్పుబట్టారు. పన్నీరు సెల్వం మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి పలకరించినప్పుడు నవ్వుతూ స్పందించడం సహజమని, స్టాలిన్ తో కలిసి నవ్వుతూ తిరిగితే ఏమైనా నేరం చేసినట్టా? అని ఆయన ప్రశ్నించారు.

ఇక ఇదే విషయమై స్టాలిన్ మాట్లాడుతూ, దివంగత సీఎం జయలలిత కూడా అసెంబ్లీలో తనను చూసి నవ్వుతూ పలకరించేవారని స్టాలిన్ అన్నారు. శశికళ తీరును చూస్తుంటే జయలలితను కూడా ప్రశ్నిస్తున్నట్లు ఉందని ఆయన దుయ్యబట్టారు.  

  • Loading...

More Telugu News