: తొందరొద్దు గవర్నర్... విద్యాసాగర్ కు సొలి సొరాబ్జీ సలహా


అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకూ తమిళనాడు గవర్నర్ వేచి చూడాలని సీనియర్ న్యాయవాది సొలి సొరాబ్జీ సలహా ఇచ్చారు. ఆమె వెనుక కనిపిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యను చూసి, ప్రమాణ స్వీకారం చేయించేందుకు తొందరపడవద్దని సూచించారు. తీర్పు వచ్చే వరకూ ఆగాలని, ఈ కేసులో ఆమె దోషిగా తేలే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయని సొరాబ్జీ అభిప్రాయపడ్డారు.

"భారత రాజ్యాంగం అత్యంత సంక్లిష్టమైనది. ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తరువాత ఆమోదించాలా? వద్దా? అన్న విషయం గవర్నర్ పరిధిలో ఉంటుంది. అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడతాయని భావించిన వేళ, దాన్ని ఎన్ని రోజులైనా అట్టి పెట్టుకోవచ్చు. తమిళనాడు పరిస్థితిని గమనించాను. అవినీతి కేసులో ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దోషిగా తేలితే, ఎన్నికల నుంచి డిస్ క్వాలిఫై అవ్వొచ్చు. ఈ అనుమానం ఉన్న సమయంలో గవర్నర్ తన విశేషాధికారాన్ని వినియోగించుకోవచ్చు. విద్యాసాగర్ రావు వేచి చూస్తేనే మంచిదని నా సలహా" అని ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సొరాబ్జీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News