: తమిళనాడు గవర్నర్ ప్రస్తుతం ముంబయిలోనే ఉంటారు: తేల్చి చెప్పిన మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాలు
తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకి ఎప్పుడు వస్తారా? అని అన్నాడీఎంకే నేతలు వెయ్యి కళ్లతో, ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న వేళ మహారాష్ట్ర రాజ్‌భవన్ వర్గాలు ఈ అంశంపై స్పందించాయి. విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన చెన్నై పర్యటనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సదరు రాజ్‌భవన్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాత్రం తమ గవర్నర్ ముంబయిలోనే ఉంటారని తేల్చిచెప్పారు. మరోవైపు తమిళనాడులో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోరినట్లు తెలుస్తోంది.