: కొత్త చర్చ 'ట్రంప్ టవల్'... వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు తప్పంటూ సాక్ష్యాలు చూపిన నెటిజన్లు


'ఏదైనా మాట్లాడే ముందు ఒక్కసారి గూగుల్ వెతకండి' అన్న కొత్త సామెత పుట్టేట్టుంది. మూడు వారాల క్రితం అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ కు ఈ సామెత తొలి పాఠాన్ని నేర్పింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పీసర్, ఓ స్టేట్ మెంట్ ఇస్తూ, ట్రంప్ ఎన్నడూ బాత్ టవల్ కట్టుకుని కనిపించలేదని, ఆయన బాత్ టవల్ తో ఎలాంటి పనులూ చేయలేదని, ఆయనకు టవల్ తో తిరిగే అలవాటు కూడా లేదని వ్యాఖ్యానించిన వేళ, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విరుచుకుపడ్డారు. తమ అధ్యక్షుడు గతంలో టవల్ కట్టుకుని దిగిన ఫోటోలను, చేస్తున్న రొమాన్స్ చిత్రాలను వెల్లువలా పోస్ట్ చేశారు. సీన్ స్పీసర్ కామెంట్లు తప్పంటూ 'ది న్యూయార్క్ టైమ్స్' ట్రంప్ బాత్ టవల్ చిత్రాలు చూపుతూ కథనాలు ప్రచురించింది. ఇక ఎంతో మంది ట్రంప్ పాత చిత్రాలను తమ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. వీటిల్లో భార్యతో బెడ్ పై, పిల్లాడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని, పడుకుని ఉన్న చిత్రాలు ఉన్నాయి. వాటిని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News