: ట్రావెల్ బ్యాన్‌పై వెనక్కి తగ్గేది లేదన్న ట్రంప్.. మరికొన్ని గంటల్లో కోర్టు తీర్పు.. విజయం తమదేనని ధీమా!


ఏడు ముస్లిం దేశాలపై విధించిన ‘ట్రావెల్ బ్యాన్’పై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ సర్కారు మరోమారు స్పష్టం చేసింది. ట్రంప్ ఉత్తర్వులపై అప్పీల్ కోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో  వైట్‌హౌస్ స్పందించింది. ట్రావెల్ బ్యాన్‌పై మరోమారు వివరణ ఇచ్చింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఏడు ముస్లిం దేశాలపైనా ప్రయాణ ఆంక్షలు విధించినట్టు పేర్కొంది. కోర్టులో తమదే విజయమని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ ధీమా వ్యక్తం చేశారు. న్యాయం అధ్యక్షుడి వైపే ఉందని, రాజ్యాంగం కూడా ట్రంప్‌కు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ట్రావెల్ బ్యాన్‌పై వెనక్కి తగ్గే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. తాము మొదలుపెట్టిన పనిని మధ్యలో వదిలిపెట్టబోమని, కొనసాగించి తీరుతామని పేర్కొన్నారు. దేశ ప్రజల భద్రతకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని, ట్రంప్‌కు దేశ ప్రజల మద్దతు ఉందని స్పైసర్ తెలిపారు.

  • Loading...

More Telugu News