: తమిళనాట నాటకీయ పరిణామాలు.. ‘అమ్మ’ సమాధి వద్ద మౌనంగా కూర్చున్న పన్నీరు సెల్వం!
చెన్నైలో నాటకీయపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మెరీనా బీచ్ తీరం లోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్దకు పన్నీరు సెల్వం వెళ్లారు. ఆమెకు నివాళులు అర్పించిన అనంతరం, అక్కడే ఆయన మౌనంగా చాలా సేపు కూర్చుండి పోయారు. ఎంత సేపటికీ ఆయన కదలకపోవడంతో కొంత కలవరం చోటుచేసుకుంది. ‘అమ్మ’ సమాధి వద్దకు పన్నీరు సెల్వం వెళ్లిన సమయంలో ఆయన వెంట పార్టీకి చెందిన ఏ సీనియర్ నాయకుడు లేకపోవడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ‘అమ్మ’ అభిమానులు మెరీనా బీచ్ వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం.