: ముఖ్యమంత్రి అయ్యేందుకు శశికళకు ఎలాంటి అర్హత లేదు: చిదంబరం


తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పార్టీ శ్రేణులు కూడా ఆమె పదవి చేపట్టడంపై ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం మాట్లాడుతూ, శశికళకు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎలాంటి అర్హత లేదని అన్నారు. అంతేకాకుండా తమిళనాట రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితులు తనకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని ఆయన తెలిపారు. శశికళకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదని పేర్కొన్న ఆయన, ముఖ్యమంత్రి కావడానికి ఆమెకు ఏ విధమైన అర్హతలేదని తేల్చిచెప్పారు. అంతేకాకుండా ఆమెపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.  కాగా, తమిళనాడు ఇన్‌ చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ఇంకా అపాయింట్‌ మెంట్ ఇవ్వకపోవడంతో శశికళ ప్రమాణ స్వీకారం ఎప్పుడనే దానిపై స్పష్టత లేదు. 

  • Loading...

More Telugu News