: భారత్ లో పాక్ ఖైదీలకు భద్రత పెంపు
పాకిస్తాన్ జైల్లో భారతీయ ఖైదీ సరబ్ జిత్ పై దాడి ఘటన నేపథ్యంలో భారత్ జైళ్ళలో ఉన్న పాక్ ఖైదీల భద్రతను పెంచారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాసిక్ కారాగారాల్లో ప్రస్తుతం ఐదుగురు పాకిస్తానీ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. సరబ్ జిత్ పై దాడి అనంతరం వీరిపై ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, వీరు శిక్ష అనుభవిస్తున్న జైళ్ళ వద్ద భద్రతను పటిష్టం చేసినట్టు మహారాష్ట్ర అదనపు డీజీ (జైళ్ళు) మీరా బొర్వాంకర్ వెల్లడించారు.