: శివసేన పార్టీ గుజరాత్ నేతగా హార్ధిక్ పటేల్: ఉద్ధవ్ థాక్రే ప్రకటన
గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోన్న యువకుడు హార్ధిక్ పటేల్‌తో ఈ రోజు శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే భేటీ అయ్యారు. ముంబయిలో కొనసాగుతున్న ఈ భేటీలో వారిరువురూ రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ... గుజరాత్‌లో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ నేతగా హార్ధిక్ పటేల్ ప్రచారం చేస్తారని కీలక ప్రకటన చేశారు. శివసేన గుజరాత్ ఎన్నికల ప్రచారం హార్ధిక్ పటేల్ సారథ్యంలో కొనసాగుతుందని చెప్పారు. గత కొన్నేళ్లుగా హార్ధిక్ పటేల్ తమ వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాడుతున్నారు.