: హిందూపురం అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను వివరించిన బాలకృష్ణ
తన నియోజకవర్గమయిన హిందూపురం అభివృద్ధి కోసం ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ సీఎం చంద్రబాబుతో చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం బాలయ్య హిందూపురం మున్సిపల్ కమిషనర్, అధికారులతో భేటీ అయ్యారు. హిందూపురంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చర్చించారు. ఆ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడానికి కావలసిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. హిందూపురంలో బయోపార్క్ రానుందని తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు పెడతామని అన్నారు. నీళ్లు లేనిదే పరిశ్రమలు అక్కడకు రావని అన్నారు. మరో నాలుగు నెలల్లో హిందూపురానికి నీళ్లు వస్తాయని అన్నారు. నీరు వచ్చేలోపే పరిశ్రమలు పెట్టే అంశాలపై విస్తృతంగా చర్చిస్తామని అన్నారు. హిందూపురాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు.