: పెద్ద నోట్లను రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంకు సిఫార్సు... ఆపైనే నిర్ణయం: పార్లమెంటులో జైట్లీ


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సిఫార్సులతోనే పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఈ ఆలోచన ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చినది కాదని, గత సంవత్సరం ఫిబ్రవరి నుంచే దీనిపై చర్చలు సాగాయని స్పష్టం చేశారు. నోట్ల రద్దు వెనక నిజాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన ఆర్బీఐ బోర్డు, ఈ మేరకు సిఫార్సులు చేసిందని తెలిపారు. చివరిగా నవంబర్ 8న ప్రధాని మోదీ ఆర్బీఐ బోర్డుతో సమావేశం కాగా, పది మంది సభ్యులున్న డైరెక్టర్ల బోర్డులో ఎనిమిది మంది సమావేశానికి వచ్చారని, అదే రోజు నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని, బ్యాంకుల్లో రద్దీ ఎంతమాత్రమూ లేదని, నగదు రహిత లావాదేవీలు కూడా పెరిగాయని జైట్లీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News