: శశికళ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసిన అన్నాడీఎంకే


తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ న‌ట‌రాజ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డానికి కొద్ది సేప‌టి క్రితం ముహూర్తం ఖ‌రారైంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నాడీఎంకే ప్ర‌క‌టించింది. ఆమె మద్రాస్ యూనివర్సిటీ హాల్‌‌లో ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని తెలిపింది. ఆమెతో పాటు కొందరు మంత్రులతో కూడా గవర్నర్ విద్యాసాగర్ రావు  ప్రమాణం స్వీకారం చేయిస్తార‌ని పేర్కొంది. ఈ రోజు రాత్రి గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ నుంచి చెన్నైకి రాగానే ఆయ‌న‌తో తాము చ‌ర్చించ‌నున్నట్లు అన్నాడీఎంకే తెలిపింది.

  • Loading...

More Telugu News