: బీహార్ లో అలజడి... 59 మంది కోబ్రా శిక్షణ కమాండోలు అదృశ్యం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు వెళుతోన్న రైలు నుంచి 59 మంది కోబ్రా శిక్షణ కమాండోలు అదృశ్యమైన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఇంతమంది శిక్షణ కమాండోలు కనిపించకుండా పోవడం అలజడి రేపుతోంది. వారంతా విధులకు హాజరు కాకూడదనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.