: పిల్లల కోసం అంత మొత్తం చెల్లించలేనని తెగేసి చెప్పిన బ్రాడ్ పిట్!


మనస్పర్థల కారణంగా విడిపోయిన హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలీనాకు త్వరలో విడాకులు మంజూరు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి ఆరుగురు సంతానం పోషణార్థం ప్రతి ఏడాది బ్రాడ్ పిట్, ఏంజెలినాలు ట్రస్ట్ ఫండ్ గా ఒక్కొక్కరు 2,50,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఆ మొత్తంలో ఒక లక్ష డాలర్లను తాను చెల్లించలేనని బ్రాడ్ పిట్ పేర్కొన్నట్లు యాషెస్ షోబిజ్ అనే వార్తా సంస్థ తెలిపింది. కానీ, బ్రాడ్ పిట్ నుంచి ఆ లక్ష డాలర్లు కూడా వసూలు చేసేందుకు ఏంజెలినా గట్టిగా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. కాగా, బ్రాడ్ పిట్ జంట మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో అధికారికంగా విడిపోనున్నారు.

  

  • Loading...

More Telugu News