: శశికళపై ఛేంజ్.ఆర్గ్ లో నెటిజన్లు చేస్తున్న విపరీత కామెంట్లలో కొన్ని!
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించేందుకు శశికళ సిద్ధమైన వేళ... ఆమెపై అభిప్రాయ సేకరణకు నడుం బిగించింది ఛేంజ్.ఆర్గ్ సంస్థ. ఈ సందర్భంగా వేలాది మంది శశికళకు వ్యతిరేకంగా తమ ఓటు వేస్తున్నారు. అంతేకాదు, ఆమెకు వ్యతిరేకంగా పలు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న కామెంట్లలో మచ్చుకు కొన్ని...
- ఒక సర్వెంట్ తమిళనాడుకు ముఖ్యమంత్రి ఎలా అవుతుంది? ఇలాంటి మూర్ఖపు పనిని నేను అంగీకరించను. దయచేసి తమిళనాడును కాపాడండి.
- ఒక సేవకురాలు నా రాష్ట్రానికి సేవ చేసేందుకు నేను అంగీకరించను. మరోసారి ఎన్నికలు నిర్వహించండి.శశికళను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోండి.
- సీఎం అయ్యే ఏ ఒక్క అర్హత కూడా శశికళకు లేదు.
- తమిళనాడు నాశనం అవుతోంది.
- ప్రధాని మోదీ ఈ విషయంలో వెంటనే కల్పించుకోవాలి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి.
- ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను శశికళకు ఓటు వేయలేదు. ప్రజల మనసులో ఏం ఉందో తెలుసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు... శశికళ మాఫియాకు తొత్తులుగా మారారు.
- హౌస్ కీపింగ్ చేసిన ఓ మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. రాష్ట్రాన్ని దోచుకోవడానికి శశికళ రెడీగా ఉంది. ఆమెను ఇక్కడితోనే ఆపేయాలి.
- రాష్ట్రంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని మేధావులే పాలించాలి.
- శశికళను ఆపండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.
- ఆమె ముఖ్యమంత్రి అయితే మన్నార్ గుడి మాఫియా పాలన వస్తుంది. ఆమెను ఇక్కడితో ఆపేయండి.