: కోహ్లీ కెప్టెన్సీ స్టైల్ సూపర్: ప్రశంసలు కురిపించిన లారా
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లోని అత్యుత్తమ ఆటగాళ్లలో కోహ్లీ ఒకడని లారా కొనియాడాడు. సహజసిద్ధమైన బ్యాటింగ్ తీరు కోహ్లీ సొంతమని... చాలా చూడముచ్చటగా ఉంటుందని చెప్పాడు. అతని బ్యాటింగ్ లో ఉన్న వైవిధ్యమే అతని పరుగుల ప్రవాహానికి కారణమని తెలిపాడు. కోహ్లీ కెప్టెన్సీ కూడా వైవిధ్యభరితంగానే ఉంటుందని... అతని కెప్టెన్సీ స్టైలిష్ గా ఉంటుందని అన్నాడు. కోహ్లీ బ్యాటింగ్ ను ఇతరుల బ్యాటింగ్ తో పోల్చాల్సిన అవసరం లేదని చెప్పాడు.