: గురువారం పెళ్లయింది... శనివారం వరుడి ఆత్మహత్య!
మూడు రోజుల క్రితం వివాహం చేసుకున్న నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మురమండ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (27) ఓ స్వీట్ స్టాల్ యజమాని. అతనికి 2వ తేదీ గురువారం నాడు పెళ్లి అయింది. ఆపై శుక్రవారం నాడు కొత్త జంట అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లి వచ్చింది. శనివారం నాడు తెల్లవారుజామున శ్రీనివాసరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి వుందని, అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించామని పోలీసు అధికారులు తెలిపారు.