: చిరంజీవి ఆ మాట చెప్పగానే దాసరి కళ్లల్లో ఆనందం కనిపించింది!: వీవీ వినాయక్


అనారోగ్యంతో కిమ్స్ లో వైద్య చికిత్స చేయించుకుంటున్న దర్శకరత్న దాసరి నారాయణరావు కళ్లల్లో తాను ఆనందాన్ని చూశానని దర్శకుడు వీవీ వినాయక్ వెల్లడించారు. ఆయన్ను పరామర్శించడానికి చిరంజీవితో కలసి వెళ్లిన వేళ, చిరంజీవి చెప్పిన ఓ మాటకు దాసరి అమితానందం చెందారని అన్నారు. "సార్‌, మీరు పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చిన తరువాతనే ‘ఖైదీ నంబర్‌ 150’ విజయంపై థ్యాంక్స్ మీట్‌ పెడతాం. ఆడియో ఫంక్షన్‌కి వచ్చి మాకు ఎంతో స్పూర్తినిచ్చిన మీరు, ఈ కార్యక్రమానికి కూడా వస్తే, మీరెంత ఆరోగ్యంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుస్తుంది" అని చిరంజీవి చెప్పడంతో, దాసరిలో ఆనందం కనిపించింది. ఆయన ఆ క్షణమే లేచి నడిచేస్తారేమో అని అనిపించిందని వినాయక్ తెలిపాడు. ఖైదీ నంబర్ 150 చిత్రానికి వచ్చిన కలెక్షన్ల గురించి, ఆయన పేపర్ పై రాయించుకుని చూసి ఆనందించారని అన్నాడు.

  • Loading...

More Telugu News