: ఆట నా చేతుల్లో ఉంటుంది...ఎంపిక నా చేతుల్లో ఉండదు: మురళీ విజయ్


క్రికెట్ ఆడడం మాత్రమే తన చేతుల్లో ఉంటుందని, ఎంపిక సెలెక్టర్లు, కెప్టెన్, కోచ్ చేతుల్లో ఉంటుందని క్రికెటర్ మురళీ విజయ్ తెలిపాడు. ఈ మధ్య కాలంలో జట్టుకు ఎంపికవుతున్న మురళీ విజయ్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు. దీనిపై ఈ ఆటగాడు స్పందిస్తూ, తాను మైదానంలో వీలైనంత ఎక్కువ సేపు ఆడి, ఎక్కువ పరుగులు చేయాలని కోరుకుంటానని తెలిపాడు. టెస్టుల్లో అందుకే నిలకడగా ఆడుతున్నానని చెప్పాడు. తాను అన్ని ఫార్మాట్లలోను ఆడాలని కోరుకుంటానని, అందుకే అన్ని ఫార్మాట్లకు ఎంపిక అవుతున్నానని తెలిపాడు. అయితే తుది జట్టులో స్థానం అనేది తన చేతుల్లో ఉండదని అన్నాడు. దానిని ఎంపిక చేసేది తాను కాదని, అందుకే ఆ విషయం తనకు తెలియదని అన్నాడు. అవకాశం వస్తే నిరూపించుకునేందుకు ఎప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని మురళీ విజయ్ చెప్పాడు. 

  • Loading...

More Telugu News