: పంజాబ్‌ పోలింగ్: బైకుపై వచ్చి కాల్పులు జరిపి, పారిపోయిన దుండగుడు


 పంజాబ్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ఓ దుండ‌గుడు కాల్పుల అల‌జ‌డి రేపాడు. ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చిన ఓ దుండ‌గుడు ఫిరోజ్‌పూర్ జిల్లా గురు హర్ సాహయ్ ప్రాంతంలో పోలింగ్ బూత్ వ‌ద్ద కాల్పులు జ‌రిపాడు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికీ గాయాలు కాలేద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. కాల్పులు జ‌రిపిన అనంత‌రం ఆ దుండ‌గుడు అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడ‌ని చెప్పారు.
 
పంజాబ్‌లోని మిగ‌తా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొన‌సాగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు రాష్ట్రంలో 48 శాతం పోలింగ్ నమోదయింద‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. మ‌రోవైపు గోవాలో జ‌రుగుతున్న పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 67 శాతం పోలింగ్ నమోదయింద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News