: రానా 'ఘాజీ' సినిమా కోసం ఐదు క్లైమాక్స్ లు!


దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కుతున్న 'ఘాజీ' సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఐదు క్లైమాక్స్ లు రాశాడట. ఆ తర్వాత, తన యూనిట్ సభ్యులతో పాటు కొంత మంది బాలీవుడ్ రచయితలతో సంప్రదించి, వాటిలో బెస్ట్ క్లైమాక్స్ ను ఫైనలైజ్ చేసి తెరకెక్కించారట.

ఈ సినిమాలో రానాతో పాటు తాప్సీ, అతుల్ కులకర్ణి, కెకె మీనన్ తదితరులు నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. సముద్ర జలాల్లో జరిగిన యుద్ధ కథతో తెరకెక్కుతున్న తొలి తెలుగు చిత్రం ఘాజీనే. 1971లో భారత్-పాక్ ల మధ్య యుద్ధ జరిగిన సమయంలో, పాక్ కు చెందిన ఘాజీ అనే సబ్ మెరైన్ అదృశ్యమైంది. ఈ కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

  • Loading...

More Telugu News