: ఏమీ రాకపోయినా.. చంద్రబాబు స్వీట్లు పంచుకోవడం దారుణం: బొత్స



కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు లేకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీట్లు పంచుకున్నారని... ఇది అత్యంత దారుణమని వైకాపా నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ గురించి బడ్జెట్ లో ఎలాంటి ప్రకటన లేకపోవడం నిరాశకు గురిచేసిందని... మార్చి 9లోగా విశాఖ రైల్వే జోన్ ను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే జోన్ పై ప్రకటన వెలువడకపోతే విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడతామని చెప్పారు. ప్రజల మనోభావాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోవడం లేదని బొత్స మండిపడ్డారు. విశాఖలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, బొత్స పైవ్యాఖ్యలను చేశారు.

వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని బొత్స విమర్శించారు. తమ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై ప్రశ్నించారని... దీనికి సమాధానంగా కమిటీ వేశామని చెప్పడం ఎంతో బాధను కలిగించిందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా టీడీపీ నేతలు కమిషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News