: యూపీ ఎన్నిక‌ల్లో బీజేపీదే విజ‌యం.. జోస్యం చెప్పిన ల‌గ‌డ‌పాటి


అన్ని పార్టీల‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిది? ఏ ఇద్ద‌రు క‌లిసినా మొద‌ట చ‌ర్చించుకుంటున్న‌ది ఈ విష‌యంపైనే. రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మాత్రం యూపీ బీజేపీ సొంతం కానుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. శుక్ర‌వారం ఆయ‌న చంద్ర‌గిరి మండ‌లం గంగుడుప‌ల్లెలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ యూపీలో బీజేపీదే హ‌వా అని తెలిపారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు నోట్ల ర‌ద్దును స్వాగ‌తించార‌ని, బీజేపీకి ప‌ట్టం క‌డ‌తార‌ని జోస్యం చెప్పారు. తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ట్టు ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా రాజ‌గోపాల్ బ‌దులిచ్చారు.

  • Loading...

More Telugu News