: అగ్రరాజ్యాధిపతికి గట్టి ఎదురుదెబ్బ.. ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు
జోరుమీదున్న ట్రంప్‌కు సియాటిల్ కోర్టు షాకిచ్చింది. ఏడు ముస్లిందేశాల ప్రజలపై ట్రంప్ విధించిన ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తూ న్యాయమూర్తి జేమ్స్ ఎల్ రాబర్ట్ శుక్రవారం ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై స్పందించిన ఫెర్గూసన్ మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విజయమని అన్నారు.