: చెన్నై సముద్రంలో 32 కి.మీ. మేర విస్తరించిన చమురు తెట్టు... 2 వేల టన్నుల చేపల మృతి!


చెన్నై హార్బర్ లో రెండు కార్గో నౌకలు ఢీకొన్న నేపథ్యంలో భారీ ఎత్తున చమురు సముద్రంలోకి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చమురు తెట్టు సముద్రంలో 32 కిలోమీటర్ల మేర విస్తరించింది. దీంతో, సముద్రంలోని అత్యంత విలువైన మత్స్యసంపదకు ముప్పు ఏర్పడింది. ఇప్పటి వరకు దాదాపు 2 వేల టన్నుల చేపలు చనిపోయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, మత్స్యకారులు చేపల వేటను పూర్తిగా నిలిపివేశారు. చమురు తెట్టును తొలగించేందుకు వెయ్యిమందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో తలమునకలై ఉన్నారు. ఇప్పటి వరకు 115 టన్నుల చమురును తొలగించారు. పూర్తి స్థాయిలో చమురు తెట్టును తొలగించాలంటే మరో వారం రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. క్రూడాయిల్ వల్ల సముద్రజలాలు కలుషితమైపోయాయి.

  • Loading...

More Telugu News