: నాన్న గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి దాసరి: నందమూరి హరికృష్ణ
హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ దర్శకుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును టీడీపీ నేత నందమూరి హరికృష్ణ పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన ఐసీయూలో ఉన్న దాసరిని కలుసుకున్నారు. కాసేపు ఆయనతో గడిపారు. అనంతరం ఆయనకు చికిత్సను అందిస్తున్న వైద్యులను దాసరి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దాసరి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, త్వరలోనే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తి దాసరి అని చెప్పారు. ప్రజలందరి ప్రేమాభిమానాలతో ఆయన త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు.