jagan: ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రజలు కాస్త ఓపికపట్టాలని, వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ చంద్రబాబు నాయుడు చేసే ప్రలోభాలకు లొంగకూడదని చెప్పారు. మూడేళ్లు గడిచిపోయానని, రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.