: మరో నాలుగు రోజులపాటు దాసరిని ఐసీయూలోనే ఉంచుతాం: వైద్యులు


తీవ్ర‌ అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ద‌ర్శ‌కుడు దాసరి నారాయణరావు కోలుకుంటున్నార‌ని వైద్యులు తెలిపారు. తాజాగా హెల్త్‌ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు... ప్ర‌స్తుతం ఆయ‌న‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. అయితే, గత నాలుగు రోజుల నుంచి చూస్తే కనుక ఈ రోజు ఆయ‌న‌ అరోగ్యం మరింత మెరుగుపడిందని తెలిపారు. ఇప్ప‌టికే డయాలిసిస్‌ కూడా ఆపెశామని, దాసరి గొంతుకు ట్రెకాత్తమి ఆపరేషన్ చేయడం ద్వారా ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నారని చెప్పారు. ఆయ‌న‌కు ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని, మరో నాలుగు రోజులపాటు  ఐసీయూలోనే ఉంచుతామని అన్నారు. అనంత‌రం వెంటిలేటర్ ను తొల‌గించి దాస‌రిని  ప్ర‌త్యేక వార్డుకు తరలిస్తామని పేర్కొన్నారు. మ‌రోవైపు ఆయ‌న‌ను ప‌రామ‌ర్శించ‌డానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు వ‌స్తున్నారు.  

  • Loading...

More Telugu News