: నారా లోకేష్ ను కేబినెట్ లోకి తీసుకుంటే... రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతాం: సీపీఐ


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటున్నట్టు చంద్రబాబు తన సహచరులతో చెప్పినట్టు వార్తలొచ్చిన సంగతి విదితమే. చంద్రబాబు ప్రకటనపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. దీనిపై సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ, మంత్రివర్గంలో నారా లోకేష్ కు స్థానం కల్పించడమేంటని ప్రశ్నించారు. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. తన కుమారుడు కేటీఆర్ ను కేసీఆర్ కేబినెట్లోకి తీసుకున్నారని... ఇప్పుడు చంద్రబాబు కూడా కేసీఆర్ దారిలో నడుస్తున్నారని విమర్శించారు. కేబినెట్ లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News