: ఒక్క సిరీస్ తో ఏకంగా 92 ర్యాంకులు ఎగబాకిన చాహల్


పొట్టి ఫార్మాట్ లో ఏ భారత బౌలర్ కూ సాధ్యంకాని విధంగా 25 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకుని ఇంగ్లండ్ పై ఇండియా విజయానికి తనవంతు తోడ్పాటును అందించిన లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఏకంగా 92 స్థానాలు ఎగబాకాడు. ఇంగ్లండ్ తో సిరీస్ కు ముందు 178వ స్థానంలో ఉన్న చాహల్, తాజా ర్యాంకుల్లో 86వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో నంబర్ వన్ ఆటగాడిగా ఉన్న కోహ్లీ, ఇంగ్లండ్ తో సిరీస్ లో విఫలమైనప్పటికీ, అతని టాప్ ప్లేస్ పదిలంగానే ఉంది. ఆపై ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్ రెండో స్థానంలో, గ్లెన్ మాక్స్ వెల్ మూడవ స్థానంలో ఉన్నారు. ఆశిష్ నెహ్రా ర్యాంకు రెండు స్థానాలు మెరుగుపడి 24కు చేరింది. ఇంగ్లండ్ కు చెందిన మోయిన్ అలీ తన ర్యాంకును 49 స్థానాలు మెరుగుపరచుకున్నాడు.

  • Loading...

More Telugu News