: తప్పును సరిదిద్దుకున్న 'బాహుబలి' టీమ్
'బాహుబలి' రెండో భాగం సినిమా ప్రమోషన్ ను దర్శకుడు రాజమౌళి అప్పుడే ప్రారంభించేశారు. ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ ఫొటోను విడుదల చేసిన రాజమౌళి... సినీ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభాస్, అనుష్కల ఫొటో చూడ్డానికి చాలా అద్భుతంగా ఉన్నా... అందులో చిన్న తప్పు దొర్లింది. ప్రభాస్ పట్టుకున్న విల్లు అనుష్క పట్టుకున్న విల్లుకన్నా ముందు ఉన్నట్టు ఫొటోలో ఉంది. దీంతో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. దీంతో, ఆ ఫొటోను సరిచేసిన బాహుబలి టీమ్... కొత్తగా మళ్లీ ఆ పోస్టర్ ను విడుదల చేసింది.