: చంద్రగిరి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి
చిత్తూరు జిల్లా చంద్రగిరి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులను బెంగళూరుకు చెందిన విజయభాస్కర్, నెల్లూరుకు చెందిన జనార్దన స్వామిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.