: ‘బడ్జెట్’పై నిమిషానికి 1500 ట్వీట్లు చేశారట!


నిన్న ప్రవేశపెట్టిన 2017-18 కేంద్ర బడ్జెట్ పై ‘ట్విట్టర్‘ ద్వారా నిమిషానికి 1500 ట్వీట్లు చేశారట. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న మధ్యాహ్నం 12.01 గంటలకు ‘ట్విట్టర్’లో కేంద్ర బడ్జెట్ పై సంభాషణ ఎక్కువగా జరిగిందని, ఈ క్రమంలో సామాన్యుడి దగ్గర నుంచి ప్రముఖల వరకు ప్రతి ఒక్కరూ దీనిపై తమ అభిప్రాయాలను పోస్ట్ చేసినట్లు తెలిపింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు ‘ట్విట్టర్’ ద్వారా బడ్జెట్ పై నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ 7.2 లక్షల ట్వీట్లు చేశారని పేర్కొంది. కాగా, బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ‘ట్విట్టర్’ వేదికగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News