: మీసం తిప్పు తమ్ముడూ.. నీకు అండగా నేనున్నా: కర్ణాటక సీఏం సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ మధ్య కాలంలో ఏది చేసినా, సంచలనంగా మారుతోంది. తాజాగా ఆయన ఆరు జిల్లాల్లోని ఆదివాసీలకు అటవీభూమి హక్కు పత్రాలను ఇచ్చారు. ఈ సందర్భంగా, తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తి మీసాన్ని తానే మెలేశారు. అంతేకాదు.. "మీసం మెలేసి, నేను గిరిజనుడిని అని గర్వంగా చెప్పు తమ్ముడూ... నీకు అండగా నేను ఉన్నా" అంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ఆదివాసీలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.