: క్లాసులో అందరూ చూస్తుండగానే వైద్య విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఆ తర్వాత తాను కూడా..


క్లాసులో అందరూ చూస్తుండగానే 20 ఏళ్ల వైద్య విద్యార్థినిపై ఓ అబ్బాయి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. ఈ దారుణ ఘటన కేరళలోని కొట్టాయంలో ఉన్న ఎస్ఎంఈ మెడికల్ కాలేజీలో జరిగింది. ఈ ఘటనలో అమ్మాయిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి.

ఆదర్శ్ అనే యువకుడు అదే కాలేజీలో పూర్వ విద్యార్థి. నిన్న మధ్యాహ్నం అతను సదరు అమ్మాయి ఉన్న క్లాస్ రూమ్ లోకి నడుస్తూ వచ్చి, అమ్మాయిపై పెట్రోల్ పోశాడు. తర్వాత తాను కూడా పెట్రోల్ పోసుకున్నాడు. ఆ అమ్మాయి అరుస్తూ బయటకు పరుగెత్తుతుండగా, వెంటపడి పట్టుకుని లైటర్ తో ఆమె దుస్తులకు నిప్పంటించాడు. ఆ తర్వాత తాను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనతో కాలేజీలో విషాదం నెలకొంది. 

  • Loading...

More Telugu News