: క్రికెట్ దిగ్గజాలను ఆశ్చర్యపరిచిన జాసన్ రాయ్ షాట్... చాహల్ ను కసురుకున్న ధోనీ


ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ రెండో ఓవర్ లో కొట్టిన షాట్ క్రికెట్ దిగ్గజాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొలి ఓవర్ బౌల్ చేసిన నెహ్రా కేవలం ఒక్కపరుగు ఇచ్చాడు. అనంతరం కోహ్లీ స్పిన్నర్ చాహల్ కు బంతిని అందించాడు. తొలి బంతిని లెగ్ సైడ్ సంధించాడు. దీనిని ఆడేందుకు జాసన్ రాయ్ ఒక్కసారిగా స్టాన్స్ మార్చుకుని, స్వీప్ గా దానిని బౌండరీ లైన్ దాటించాడు. సాధారణంగా స్పిన్నర్ బౌలింగ్ లో లాంగ్ ఆన్, లేదా లాంగ్ ఆఫ్ ఇంకా లేదంటే లెగ్ సైడ్ సిక్సర్ కొడతారు. ఇంక ఏ దిశగా బంతిని కొట్టినా బౌండరీ సాధిస్తారు. కానీ స్పిన్నర్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ను స్విచ్ వేసినట్టు స్టాన్స్ మార్చుకుని సిక్సర్ సాధించడం దాదాపు అసాధ్యం.

 ఒక వేళ కొట్టినా...అది బౌండరీ అవుతుంది. జాసన్ రాయ్ కొట్టిన షాట్ మాత్రం నేరుగా ప్రేక్షకుల్లో పడడంతో కామెంటేటర్లు ఆశ్చర్యపోయారు. ఇలాంటి షాట్ కొట్టడం అసాధ్యమని, అంత అవలీలగా కొట్టడం చూస్తుంటే యువ ఆటగాళ్ల నైపుణ్యాన్ని కొనియాడాలని ప్రశంసించారు. తరువాతి బంతికి సింగిల్ ఇచ్చిన చాహల్, మలి బంతికి బిల్లింగ్స్ ను పెవిలియన్ కు పంపాడు. అనంతరం కోహ్లీ ఇచ్చిన అద్భుతమైన త్రోను వినియోగించుకోవడంలో విఫలమైన ధోనీ ఆగ్రహానికి గురయ్యాడు. మైదానంలో భావోద్వేగాలు నియంత్రించుకునే ధోనీ రనౌట్ మిస్ కావడంతో తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

  • Loading...

More Telugu News