: ప్రధానికి, ఆర్థిక మంత్రికి అభినందనలు: సీఎం చంద్రబాబు


అమరావతి రాజధాని రైతులకు మూలధనం లాభంలో పన్ను మినహాయింపు నిచ్చిన ప్రధానికి, ఆర్థిక మంత్రికి అభినందనలు తెలుపుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న మీడియా సమావేశంలో ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ గురించి ఆయన మాట్లాడుతూ, తన పిలుపు మేరకు భూ సమీకరణలో భాగంగా రైతులు భూములు ఇచ్చారని, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రైతులు తనపై విశ్వాసంతో భూములు ఇచ్చారని అన్నారు. కేంద్ర బడ్జెట్ లో మౌలిక వసతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇచ్చారని, నాబార్డు కార్పస్ కు మరో రూ.40 వేల కోట్లు, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచారని, గృహ నిర్మాణ రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చారని అన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోస 20 లక్షల పీవోఎస్ యంత్రాలను అందుబాటులోకి తేవాలని కొన్ని సిఫార్సులు చేశామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News