: తెలంగాణకు ఎయిమ్స్ కేటాయించకపోవడం నిరాశకు గురిచేసింది: టీఆర్ఎస్ ఎంపీ కవిత
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అనంతరం టీఆర్ఎస్ ఎంపీ కవిత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి ఎయిమ్స్ ను కేటాయించకపోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. వార్షిక బడ్జెట్‌లో చాలా మంచి విషయాలు ఉన్నట్లు చెప్పిన ఆమె... రాష్ట్రానికి ఎయిమ్స్ రాకపోయినా, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పన్ను తగ్గించడం మంచి అంశమేనని వ్యాఖ్యానించారు. తాను బడ్జెట్ ను పూర్తిగా చదివిన తర్వాత మరోసారి స్పందిస్తానని అన్నారు.