: కాజోల్ ట్వీట్ కి కుమార్తె కౌంటర్!
ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ కు కుమార్తె నిసా (13) కౌంటరిచ్చింది. కాజోల్, అజయ్ దేవగణ్ దంపతులు తమ పిల్లలు నిసా (13), యుగ్ (6) తో ఇటీవల సరదాగా ముచ్చట్లాడుకుననారు. ఆ సందర్భంగా హ్యాపీ మూడ్ లో వున్న కాజోల్ తన హావభావాలను ఫోటో తీసి, ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. 'మా పిల్లలను కలసి సరదాగా చూస్తుండగా..' అంటూ ఓ వ్యాఖ్యను కూడా ఆ ఫోటోకి జోడించింది.
దీనికి స్నేహితులు, అభిమానుల నుంచి అభినందనలు అందాయి. అయితే, కూతురు నిసా నుంచి మాత్రం కౌంటర్ వచ్చింది. 'మామ్ నువ్వు చాలా ఎక్ర్ ట్రాలు చేస్తున్నావు' అంటూ నిసా ట్వీట్ చేసింది. గతంలో కూడా దీపావళి సందర్భంగా కాజోల్ ఓ ఫోటో పోస్టు చేసినప్పుడు కూడా... 'ఇదేం ఫోటో... నాకు చాలా బ్యాడ్ గా అనిపిస్తోంది' అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ కౌంటర్లకి కాజోల్ కోపం తెచ్చుకోకుండా, తన కూతురికి తన దగ్గర ఎంతో స్వేచ్ఛ అంటూ మురిసిపోతోంది.