: మెగా హీరో సినిమాను ప్రమోట్ చేస్తున్న మహేష్ బాబు
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. హీరోలంతా తమ మధ్య పోటీని పక్కన పెట్టి, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒకరి వేడుకలకు మరొకరు హాజరవుతున్నారు. వాయిస్ ఓవర్ అందించడానికి, ఇతరుల సినిమాలను ప్రమోట్ చేయడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. దాంతో అభిమానుల మెప్పు పొందుతున్నారు.
తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కూడా మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విన్నర్' సినిమాను ప్రమోట్ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. తన సోషల్ మీడియా పేజ్ లో ఈ సినిమాలోని ఓ పాటను మహేష్ రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మషేష్... తన సినిమా లొకేషన్ నుంచే 'సితార' అనే పాటను రిలీజ్ చేస్తున్నాడు. మహేష్ కుమార్తె పేరు కూడా సితార కావడంతో... ఈ పాటను అతని చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నారు.
'విన్నర్' సినిమా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా... పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.
#Winner #Thankyousuperstar pic.twitter.com/BK0mCE5RTy
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 1, 2017