: లక్ష్మీదేవి కన్నా మంచు లక్ష్మిని ముప్పై మూడున్నర రెట్లు ఎక్కువగా ఆరాధిస్తా: వర్మ
వివాదాస్పద ట్వీట్లకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ ఈసారి మంచు లక్ష్మిపై ట్వీట్ చేశాడు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ ఆకారం తుపాకీలా మారిందంటూ ఆయన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, లక్ష్మీదేవి చేతిలో నవ్యాంధ్ర మ్యాప్ ను ఉంచిన ఫొటోను అప్ లోడ్ చేశారు వర్మ. తన చేతిలో ఏపీ గన్ ఉండటం పట్ల లక్ష్మీదేవి సంతోషపడుతోందని వ్యాఖ్యానించాడు. అయితే, ఇంతటితో దానిని వదిలేయలేదు. కానీ, లక్ష్మీదేవితో మంచు లక్ష్మిని పోలుస్తూ కామెంట్ చేశారు. విష్ణు దేవుడి భార్య లక్ష్మీదేవి కంటే తనకు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి అంటే ముప్పై మూడున్నర రెట్లు ఎక్కువ ఆరాధన అని తెలిపాడు. దీనిపై ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడాలి.
Am so happy with the Great Godesse's blessing ..Lucky Andhra Pradesh