modi: బడ్జెట్ పై స్పందించిన ప్రధాని మోదీ
రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభ ఎల్లుండికి వాయిదా పడింది. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్‌లో రైతులు, పేదలు, గ్రామీణ ప్రాంతవాసులకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఉపాధి హామీకి ఎప్పుడూ ఇవ్వనంత నిధులు ఇచ్చామని అన్నారు. మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చామని అన్నారు. ఆదాయపన్ను 10 నుంచి 5 శాతానికి తగ్గించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. చిన్న వ్యాపారులకు ఈ బడ్జెట్ ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఈ బడ్జెట్‌తో హౌజింగ్ సెక్టార్ కూడా మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పారు.